గణితాంజలి;- నెల్లుట్ల సునీత-7989460657
అరవదేశంలో అవతరించిన
  గణితాభిరాముని జన్మదినం
విశ్వ అవనికపై మెరిసిన మణికిరణం
గణిత గుణమనులను అనువణువునా పొదవుకొని
నవ శకానికి నాంది పలికి 
గణిత జగతికి పునాది వేసినా 
భరతమాత ముద్దుబిడ్డ
సమీకరణాలే ధ్యాసగా 
అంకలే శ్వాసగా స్వాసించిన
మహా పురుషుడు
 చిరుప్రాయంలోనే త్రికోణమితితో
అంకురించిన ఆలోచనలు
నిరుపమాన ప్రజ్ఞతో
 జగతినే మెప్పించాయి 

సంఖ్యా వ్యవస్థను ప్రవేశపెట్టి 
సర్పిల పద్ధతిని కనిపెట్టి
సిద్ధాంతాలను సూత్రికరించి
నూతన ఆవిష్కరనలకు
ఆజ్యం పోసిన ఘనత అతనిది
మ్యాజిక్ స్కోర్స్
ధీరి ఆఫ్ నెంబర్స్ తో 
చెడుగుడులాడిన  మేధస్సు 
గణితశాస్త్ర దశ దిశలను 
మార్చిన జీనియస్

కాగితాలు కొనలేని బీదరికం వెక్కిరించినా
ప్రతిభకు పేదరికం అడ్డు కాదని చాటిన జ్ఞాన తృష్ణ
మట్టి పలకపై లెక్కలేని లెక్కలను సాధన చేసి
విభిన్న గణాలతో టాక్సీ క్యాబ్స్ నెంబర్స్ తో అంకెల గారడి చేసిన గణితమాంత్రికుడు
విజ్ఞాన శిఖరాలపై గణిత పతాకాన్ని ఎగరవేసిన విశ్వ కీర్తి 
 మన సమున్నత సంఖ్య
శ్రీనివాస రామానంజన్ కి
ఘనముగా గణితాంజలి.(డిసెంబర్ 22 గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా)


కామెంట్‌లు