జానకి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 స్త్రీ ధర్మాలను గురించి మాట్లాడవలసి వస్తే ముందు సీతమ్మవారిని గురించి చెప్పాలి  ఆమె వివాహ సందర్భంగా తల్లి చెప్పిన ఒకే ఒక విషయం  జీవితంలో భాగస్వామియైన భర్త ఎక్కడ ఉంటే అదే నీ నివాసం  అన్న మాటకు కట్టుబడి తన జీవితాన్ని  కొనసాగించిన మహాసాద్వి సీతమ్మ తల్లి శ్రీరామచంద్రమూర్తికి తగిన ఇల్లాలుగా  సీతారాములు  అన్న పేరు శాశ్వతంగా ఉండేలా ప్రతి సంవత్సరం వారి వివాహ మహోత్సవం జరపడం  మనం చూస్తూనే ఉన్నాం  అలాంటి బంగారు తల్లి తన ఇంటిలో పుట్టాలని ప్రతి గృహిణి కోరుకుంటుంది  అడవులలోకి వెళ్లి బండరాళ్లపై  పరువుల పై ఉండవలసిన తల్లి భరించి ఆనందాన్ని అనుభవించింది. పంచమాతల్లో ప్రధమంగా నిలిచిన  పతివ్రతలకే  ఆదర్శవంతమైన పతివ్రత సీతమ్మ తల్లి జీవితాన్ని గురించి  ముందు తెలుసుకుందాం. రామాయణం అంటే  రాముని చుట్టూ తిరిగేది అని అర్థం  కానీ వాల్మీకి మహర్షి  ప్రపంచ ప్రజలకు ఆదర్శప్రాయమైన  గాయత్రి మంత్రాన్ని స్వీకరించి దానిలో ఉన్న 24 అక్షరాలను తీసుకొని  ఒక్కొక్క అక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున 24 వేల శ్లోకాలతో రామాయణాన్ని రచించారు  ధర్మానికి మూలమైన వేదం  జటాయువుతో ప్రారంభమవుతుంది జట అంటే వేదం ఆయువు అంటే మూలం  అది సామవేదం  ఆ వేదాన్ని మూడు విభాగాలుగా చేసి దానిని వేదత్రయి అన్నారు శంకరాచార్యుల వారు  అందువల్లనే త్రి జట అన్న విభీషణుని కుమార్తెతో  రామాయణం పూర్తవుతుంది  రాముడు అనే అర్థానికి అంకిత భావంతో పనిచేసేవాడు అని అర్థం  తన సుఖంతో పాటు ఇతరుల సుఖాన్ని కూడా ఆకాంక్షించేవాడు అని మరో అర్థం  వాటిని దృష్టిలో పెట్టుకుని వాల్మీకి మహర్షి గ్రంథాన్ని మనకు అందించారు  ధర్మాచరణ ముఖ్యంగా చెప్పడం వల్ల  ప్రపంచ ప్రజలందరకు ఆదర్శ గ్రంథమైనది మన రామాయణం.

కామెంట్‌లు