ఏక సందాగ్రాహి వేంకట రాజుగారు;-ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 నాజర్ ఎవరో తెలియకుండా  వారి బుర్రకథ వినకుండా  తాను స్వయంగా  అల్లూరి సీతారామరాజు బుర్రకథ చెబుతూ ఉంటే  ప్రతి కదలిక లోను నాజరే కనిపిస్తాడు  ఆమె భద్రకాళి  వినయానికి  మారుపేరు  మగవారిలో  బుర్రకథ అంటే నాజర్ నాజర్ అంటే బుర్రకథ  అంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నది  మా భద్రకాళి  మా అనడానికి కారణం  నా మాతృ సంస్థ ఆకాశవాణి ద్వారా  అనేక కథలతో  తన గళాన్ని వినిపించింది కనుక  చరిత్రలో నాజర్ పేరు ఎలా నిలిచి ఉంటుందో  భద్రకాళి కూడా అంత  ప్రాచర్యం చెందింది  నేను విశాఖపట్నం వెళ్ళిన తర్వాత  ఆమెను అక్కడకు పిలిచి వేదిక పైన ప్రత్యేక కార్యక్రమం కూడా  ఏర్పాటు చేశాం  స్వయంకృషితో  రజని మా కేంద్ర  అధిపతి  కథను బుర్రకథగా మార్చి చెప్పిన ఘనత ఆమెకు దక్కుతుంది  నాన్నగారు నాజరు గారికి ఎంత  ప్రోత్సాహం ఇచ్చారో భద్రకాళికి మా సంస్థ  అంత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. విశాఖపట్నంలో నాకు బికే శాస్త్రి గారి వ్యక్తిత్వం నచ్చింది అంతా ఆయన తాగుబోతుగా చూస్తాడు నాకెందుకో ఆయన ఒక గొప్ప తత్వవేత్త లాగా కనిపిస్తాడు వారి నాన్నగారు బొజ్జా అప్పలస్వామి గారు  1952 ప్రాంతంలో అసెంబ్లీకి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రారంభించిన ఆయన పార్టీ చిహ్నంతో పోటీ చేస్తే భారతదేశంలో ఎక్కువ ఓట్లు సంపాదించిన మూడవ వ్యక్తిగా అప్పలస్వామిగారు నిలిచారు మొదటి వ్యక్తి పండిత్ జవహర్లాల్ నెహ్రూ  రెండవ వ్యక్తి పి వి జి రాజు మూడు స్థానాల్లో రెండు స్థానాలు తెలుగు వాళ్ళు పొందటం మనకు గర్వ కారణం  ఆ ఎన్నికల్లో ఆ పార్టీ పెట్టిన అంబేద్కర్ గారికి డిపాజిట్ కూడా తగ్గలేదు మహారాష్ట్రలో. నాన్నగారు హరికథలు రాయడంలో కూడా  పేరెన్నిక గన్నవారు.వారి ఆసుపత్రికి దగ్గరలో ఉన్న శర్మగారు ప్రతిరోజు వారి దగ్గరకు వచ్చి  వారు రాసిన కొత్త కథలను నేర్చుకునే వారు  ఒకరోజు మాటల సందర్భాల్లో  నాన్నా మన శర్మ గారిని రేడియోలో  కథకునిగా ఎన్నిక చేయవచ్చు కదా అని చెప్పినప్పుడు  వారిని పిలిచి  ఆడిషన్ లో ఎన్నిక చేయించి  వారితో అనేక కథలు చెప్పించాను  ఒకసారి నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు శర్మగారు వచ్చి  తన శిష్యురాలిని నాకు పరిచయం చేసి  మీరు ఎలాగైనా ఈ మేడమ్ ని ఆకాశవాణిలో కథ చెప్పించే ఏర్పాటు చేయమని బ్రతిమిలాడారు  నేను రేడియో కళాకారులుగా తయారు కావడానికి మీరు మీ నాన్నగారు కారకులు  అలాగే ఈమెకు మీ సహాయం అవసరం  అని చెపితే  మా కేంద్ర నిర్వాహకులు ప్రసాదరావు గారి పరిచయంతో ఏర్పాటు చేయించాను. 


కామెంట్‌లు