ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ప్రముఖ  గాంధేయవాది  బొజ్జా అప్పల స్వామి గారు  వారు ఒక రోజు ఆకాశవాణి విశాఖపట్నం (అక్కడ  కృష్ణశాస్త్రి  డ్యూటీ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు స్వామి గారి అబ్బాయి  కృష్ణశాస్త్రి)  నేను విశాఖపట్నం వెళ్ళగానే నన్ను మొదట  పలకరించిన వారు వారే నీవు నిన్నటి వరకు విజయవాడ బ్రాహ్మణులలో కలిసి వచ్చావు  నా పేరులో ఉన్న శాస్త్రి  చూసి నన్ను కూడా ఆజాతి వాడే అనుకోవద్దు  నేను కడ జాతి వాడిని  స్వామి గారు మా నాన్నగారు  నీలం సంజీవరెడ్డి గారి శిష్యులు  ఆశయానికి ఆదర్శంగా మెలిగిన వ్యక్తి  గాంధీజీ చెప్పిన ప్రతి అక్షరాన్ని తూచా తప్పకుండా నడిపిన వాడు  రెండు పర్యాయాలు  ఎంఎల్ఏ గా  ఎన్నికై  తన ప్రాంతానికి ఎంతో సేవ చేసిన  వ్యక్తి మా నాన్న  అని పరిచయం చేశాడు కృష్ణ శాస్త్రి గారు. వారి గురించి నాన్నగారితో చెబితే  అలాంటి ఆదర్శప్రాయుణ్ణి మనం రికార్డు చేయాలి  అని చెప్పి  న తరువాత  నాన్నగారు నేను కలిసి వారి గ్రామానికి వెళ్లి  వారితో మూడు గంటలు  రికార్డు చేశాము  కడజాతిలో జన్మించినా ఉన్నత జాతి లక్షణాలే తప్ప  ఎలాంటి దుర్గుణాలు లేని వ్యక్తి  గాంధీజీ ఎలా పంచి తప్ప  మరొక వస్త్రం వాడ లేదో ఈయన కూడా అంతే కడజాతి వారు అనగానే  గొడ్డు మాంసాన్ని కూడా తినేవాడు అన్న అభిప్రాయం  చాలామందిలో ఉంటుంది  కానీ వీరు  కోడిగుడ్డు కూడా ముట్టరు   పూర్తి శాకాహారి  సాత్వికంగా మాట్లాడడం తప్ప  పరుషంగా మాట్లాడిన సందర్భాలు ఆయన జీవితంలో లేవు  సాధ్యమైనంతవరకు ఇతరులకు  సహకరించడంతోనే  వారి జీవితం కొనసాగింది. విశాఖపట్నంలో నాకు బికే శాస్త్రి గారి వ్యక్తిత్వం నచ్చింది అంతా ఆయనను తాగుబోతుగా చూస్తారు నాకెందుకో ఆయన ఒక గొప్ప తత్వవేత్త లాగా కనిపిస్తాడు వారి నాన్నగారు బొజ్జా అప్పలస్వామి గారు  1952 ప్రాంతంలో అసెంబ్లీకి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రారంభించిన ఆయన పార్టీ చిహ్నంతో పోటీ చేస్తే భారతదేశంలో ఎక్కువ ఓట్లు సంపాదించిన మూడవ వ్యక్తిగా అప్పలస్వామిగారు నిలిచారు మొదటి వ్యక్తి పండిత్ జవహర్లాల్ నెహ్రూ  రెండవ వ్యక్తి పి వి జి రాజు మూడు స్థానాల్లో రెండు స్థానాలు తెలుగు వాళ్ళు పొందటం మనకు గర్వ కారణం  ఆ ఎన్నికల్లో ఆ పార్టీ పెట్టిన అంబేద్కర్ గారికి డిపాజిట్ కూడా తగ్గలేదు మహారాష్ట్రలో.




కామెంట్‌లు