ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 విశాఖపట్నంలో నేను పనిచేస్తున్న సమయంలో రుద్రరాజు కుమార్ రాజు గారితో నాకు పరిచయం ఏర్పడింది  ఆయన మా మిత్రుడు రామ చందర్రావు  కలిసి అనేక నాటకాలను వ్రాయించుకొని  వేదికపై ప్రదర్శిస్తూ ఉండేవారు  కుమార్ రాజుగారు  కథానాయకుడిగా చేస్తూ ఉంటే రామచంద్ర రావు గారు  ప్రతి నాయకునిగా నటించేవారు  ఇద్దరూ నీవా నేనా అన్న పద్ధతిలో  ప్రేక్షకుల ప్రశంసలను పొందారు  అక్కడ విశాఖపట్నంలో వీరు ఏ గ్రేడ్ ఆర్టిస్ట్  నాకు పరిచయం అయిన తర్వాత నాటకాలలో వారిని పిలిపించుకుని  కుమార్ రాజుగారు ప్రత్యేక పాత్రలోనూ లేక ప్రతినాయకులుగాను నటించేవారు  ఆయనకు ఇద్దరు కుమార్తెలు వారిద్దరినీ కూడా ఆకాశవాణి ఆడిషన్ లో ఎన్నిక చేసి వారితో కూడా చిన్న చిన్న వేషాలు వేయిస్తూ ఉండేవాడిని. పిల్లలు ఇద్దరు కాన్వెంట్లోనే చదువుతున్నారు  చిన్నపిల్ల  కాలేజీలో మొదటి సంవత్సరం  చదువుతున్నప్పుడు మొదటి నాటకానికి నేను పిలిచినప్పుడు  తెలుగు చదవడానికి కూడా చాలా ఇబ్బంది పడింది  అయితే చెప్పగానే జ్ఞాపకం పెట్టుకుని దానిని  మనం చెప్పింది చెప్పినట్టుగా చేయగలిగిన సత్తా గలిగిన పాప  నాకు కూతురుగా మనవరాలిగా అనేక నాటికలలో  తాను నటించింది  అనేక పర్యాయాలు వారింటికి వెళ్లి  వారి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించే వాడిని నేను ఒకరోజు విజయవాడలో నాన్నగారి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు  నాకు అక్కడ కుమార్ రాజుగారు కనిపించారు  చాలా ఆశ్చర్యపోయాను  అప్పుడు నాన్న గారు పరిచయం చేసి  కుమార్ రాజుగారు నాకు చాలా పాత స్నేహితుడు  మాకు రాకపోకలు చాలా ఉన్నాయి  అని చెప్పారు.
ఆరోజు రాత్రి ప్రయాణం పెట్టుకోవడంతో  నాన్నగారు వాళ్ళ ఫోటోగ్రాఫర్ ని పిలిపించారు  నేను  మీ మాటల్లో మీ జీవితం శీర్షికన కుమార్ రాజు గారితో  వారి జీవితం ఆ రోజుల్లో నాటకాలు ఎలా ఎన్నిక చేసేవారు ఏ పాత్రలు ఎవరెవరికి  ఎలా కేటాయించేవారు  నాటకం తయారు కావడానికి ఎలాంటి  నియమాలు పెట్టుకునే వారు లాంటి విషయాలను అన్నిటినీ సమగ్రంగా ఆయన నోటి నుంచి చెప్పించి  రికార్డ్ చేశాను  రికార్డింగ్ అయిపోయిన తర్వాత  నాతో ఇన్ని విషయాలు చెప్పిస్తారని నేను అనుకోలేదు  నేను కూడా నాకు ఇన్ని విషయాలు తెలుసా అని ఆశ్చర్యపోయాను  ఆనంద గారు విశాఖపట్నంలో నాటకం చేస్తున్న సమయంలో  వారి నిజాయితీ అంకితభావం  చూసి నేను ముగ్ధున్ని అయ్యే వాడిని  అలా నేను కూడా ఉంటే బాగుండును కదా అనిపించేది  అలా ఆయనతో కలిసి పని చేశాను.

కామెంట్‌లు