కుంతి;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.

 ఒకరోజు దేవయాని శర్మిష్టా ఇతర దాసీ జనంతో వనవిహారానికి వెళ్లారు నహుష నందనుడైన యయాతి అలసి సొలసి అక్కడికి చేరాడు దాసీ జనం మధ్యలో ఆసీనురాలైన దేవయానిని శర్మిష్ఠను చూసి ఎవరు మీరు అని అడిగాడు వారితో పరిచయమైన తర్వాత దేవయాని ఓ రాజా నేను నా దాసీ జనం శర్మిష్ఠ తో సహా మీ అధీనంలో ఉన్నాం నేను మిమ్మల్ని నా స్వామిగా స్వీకరించాను అని చెప్పింది అందుకు బదులుగా శుక్ర నందిని నేను శుద్రుని కనుక మీ తండ్రిగాడు నిన్ను నాకిచ్చి పెళ్లి చేయరు అన్నాడు ఓ రాజా  ఒకరోజు ఇలాగే వేటకు వచ్చిన నీవు బావిలో నుండి నన్ను తీసినప్పుడే నా చెయ్యి పట్టుకున్నావు అప్పుడే మీరు నా స్వామి అయినారు అని చెప్పింది దేవయాని. మీ నాన్నగారు అంగీకరిస్తే నిన్ను వివాహం చేసుకుంటాను అన్నాడు వెంటనే దేవయాని తన తండ్రిని పిలిపించి విషయమంతా చెప్పింది.
అందుకు శుక్రాచార్యుడు అంగీకరించి తన పుత్రికను భార్యగా స్వీకరించమని కోరాడు తర్వాత శాస్త్రయుక్తంగా వివాహం జరిగిపోయింది  యయాతి మహారాజు తన అందమైన నగరం (రాజధాని) లోనికి  తీసుకొని వెళ్లి దేవయానిని తన అంతపురంలో ఉంచాడు. దేవయాని అనుమతితో శర్మిష్ఠకు దాసీ జనానికి అశోక వాటిక యందు ఉండే ఏర్పాటు చేశారు కార్యక్రమములో దేవయానికి యాయాతికి ఇద్దరు కుమారులు జన్మించారు ఒకరోజు మహారాజు ఒంటరిగా అశోక వాటికకు వెళ్ళగా శర్మిష్ఠ రాజును కలుసుకొని రాజా నా ప్రార్థన ఏమంటే నాకు ఋతు దానం చేస్తూ సమయాన్ని సఫలం చేయండి శర్మిష్ఠ ప్రార్ధనకు యయాతి సమ్మతించారు ఈ విషయం తెలుసుకున్న దేవయాని ఆగ్రహం కట్టలు తెంచుకుంది యయాతి ఎంత చెప్పినా వినకుండా తండ్రి అయిన శుక్రాచార్యులు వద్దకు వెళ్లిపోయింది. దేవయానిని అనుసరించిన యయాతి కూడా శుక్రాచార్యుల వద్దకు చేరుకున్నాడు దేవయాని తండ్రిని ఉద్దేశించి నాన్నగారు ధర్మము అధర్మముపై ఓడిపోయింది ధర్మజునైన మహారాజు ద్వారానే శర్మిష్ఠ ముగ్గురు కుమారులను కన్నది  మీరే న్యాయ నిర్ణయం చేయండి ఓ రాజా నీవు ధర్మ మర్యాదను ఉల్లంఘించావు కావున ముసలి వాడవుగా కమ్ము అని శపించాడు. కొంతకాలం వరకు నీ ముసలితనాన్ని నీ కొడుకులకు ఎవరికైనా ఇచ్చి వారు యవ్వనాలని నీవు తీసుకో అని చెప్పాడు  శుక్రాచార్యులు యయాతి రాజదానికి తిరిగి వచ్చి దేవయాని కుమారుల ఎదుట ఈ ప్రస్తావన చెపితే వారు ఎవరు సమ్మతించలేదు చెప్పలేదు తర్వాత శర్మిష్ట కుమారుల వద్దకు వెళ్లి చెప్పగా  వారు కూడా సమ్మతించని కారణంగా నిరాశపరుడైన  యయాతి చిన్న కుమారుడైన పురుని విచారించగా కుమారుడు తన సమ్మతిని ప్రకటించాడు.

కామెంట్‌లు