"అమ్మ నాన్న గురువు" శతక పద్యార్చన; - "కవిమిత్ర" శంకర ప్రియ., శీల.,-సంచార వాణి:- 99127 67098

⚜️అమ్మ నాన్న గురువులే
      భువి ప్రత్యక్ష దైవాలు!
      సకల మానవాళికి
       సాధు శీల! ఆంధ్ర బాల!
    ( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
👌 మన భారతీయ సంస్కృతిలో.. అమ్మ, నాన్న, గురువులకు విశిష్ట స్థానమున్నది! అందు వలన.."మాతృ దేవో భవ!".. "పితృ దేవో భవ!".. ఆచార్య దేవో భవ!".. అని, తొలిపలుకులైన వేదవాక్కులు! ఆ వేదానుశాసనము ప్రకారం.. తల్లి, తండ్రి, అధ్యాపకులే .. మనకు ప్రత్యక్షముగా కనుపించు దైవములు! వారే.. మన పురోభివృద్ధికి రాచబాటలు!
 ⚜️"అమ్మ, నాన్న, గురువు శతక పద్యార్ఛన" కార్య క్రమం..  "తానా" మరియు "వందే విశ్వ మాతరమ్" ఆధ్వర్యంలో... "అమ్మ, నాన్న, గురువు శతక పద్యార్ఛన" ప్రతిష్టాత్మక కార్య క్రమం.. 2023 డిసెంబర్ 18, 19వ.తేదీలలో.. ఆంధ్ర, రాయలసీమ,  తెలంగాణా ప్రాంతము లందు; మనదేశ మందు, విదేశము లందు.. వైభవంగా జరిగింది!విద్యార్థులందరూ..  "అమ్మ శతకం, నాన్న శతకం, గురువు శతకo" లలోని పద్యములను కంఠస్థం చేసారు! తమ పాఠశాలలలో సామూహిక పద్యగానం కావించారు!
⚜️ ఈ బృహత్తర కార్యక్రమము.. తానా అధ్యక్షులు.. శ్రీశృంగవరపు నిరంజన్; వందే విశ్వ మాతరమ్ ఛైర్మన్ శ్రీజయశేఖర్ తాళ్లూరి, శతకత్రయ రచయిత  శ్రీచిగురుమళ్ళ శ్రీనివాస్.. తదితరులు... విజయవంతం కావించారు! వారి కృషి, పట్టుదల, నిర్వహణ  ప్రశంసనీయమైనవి!
🔆 ఇదియొక చారిత్రక ఘట్టము! ఒక ఉత్సవము! తెలుగు భాషకు జరిగిన మహోద్యమము! పెద్దలకు పిన్నలకు పర్వదినము! ఇది లోకకళ్యాణ మహాసంకల్పము! విశ్వవేదిక మీద తెలుగు బాలబాలికలు ఎగురవేసిన అక్షర జయకేతనము! శ్రీరస్తు! శుభమస్తు! 
కామెంట్‌లు