ఛాలెంజ్!;-- -గద్వాల సోమన్న,9966414580
పిల్లలను దిద్దితే
వజ్రమై మెరవరా!
సద్బోధలు చేస్తే
సూర్యులై వెలగరా!

ధైర్యాన్ని నింపితే
మగధీరులవ్వరా!
విలువలను నేర్పితే
గొప్ప పేరు తేరా!

సాహసం చూపితే
చరిత్ర సృష్టించరా!
పిరికితనం తరిమితే
ప్రపంచాన్ని గెలవరా!

స్నేహమే పంచితే!
గువ్వలై ఒదగరా!
మంచినే పెంచితే
మహనీయులు కారా!


కామెంట్‌లు