ప్రకృతి పాఠం;= -గద్వాల సోమన్న,9966414580
శిలలెన్ని ఎదురైనా
కలలెన్ని చెదిరినా
గలగల ప్రవహించే
సెలయేరు కావాలి

చీకట్లు చీల్చుకుని
ఇక్కట్లు తరుముకుని
ఉదయించే సూర్యుడు
ఆదర్శమవ్వాలి

భూమి పొరలు విచ్చుకుని
అవస్థలు ఎదుర్కొని
మొలకెత్తు విత్తనం
పౌరుషం రావాలి

దేవుని సృష్టిలోన
విశాల విశ్వంలోన
ప్రతిదీ ఆదర్శం
నేర్పించును పాఠం


కామెంట్‌లు