సదనాన అక్క-గగనాన చుక్క;- -గద్వాల సోమన్న,9966414580
సదనంలో అక్క
గగనంలో చుక్క
కుటుంబాన రాణి
చదివిస్తే వాణి

గృహంలో దీపిక
గులాబీ మాలిక
ఆనంద వీచిక
అపురూప కానుక

అమ్మలా ఉండును
కొమ్మలా ఎదుగును
మా మంచి అక్క
మమకారపు మొక్క

ఎత్తికొని తిరుగును
కమ్మగా పాడును
ఆటలు ఆడించి
పరుండబెట్టును

అన్నం తినిపించు
కథలను విన్పించు
ఆటపాటలతో
అమ్మను మరపించు

తోడుగా వచ్చును
నీడగా మారును
అక్కంటే ప్రేమ
అనురాగ సీమ


కామెంట్‌లు