అనురాగ దేవత అమ్మ- -గద్వాల సోమన్న,9966414580
అమ్మ వంటి దేవత
ఆమె మోయు బాధ్యత
అవనిలో  వెదికినా!
దొరుకునా చూసినా!

తల్లిలాంటి త్యాగము
మల్లె వంటి హృదయము
ఎల్లరికీ ఉండునా!
వెన్నెల్లా పండునా!

అమ్మ ప్రేమ తోటలో
అనురాగపు కోటలో
ఆనందం కురియదా!
ఆహ్లాదం కురియదా!

తల్లి చేతి చలువతో
ముద్దులొలుకు పలుకుతో
బ్రతుకు బాగుపడదా!
భవిత చక్కబడదా!


కామెంట్‌లు