మీకు తెలియునా... పిల్లలూ ! ;- * కోరాడ బాల గేయాలు *
మన0 నివసించే భూ గోళం
ఎంత గొప్పదో మీకు... 
తెలియునా   పిల్లలూ...! 

నింగి నుండి పుట్టెను గాలి... 
ఆ గాలి నుండె అగ్ని పుట్టెను
 అగ్ని నుండి నీరు పుట్టెను
 ఆ నీటి నుండె పుట్టింది... 
  మనముండే ఈ భూమి...! 

మరే గ్రహము లోనూ 
  లేని గొప్పతన0 
     ఈ భూమికే వున్నది...! 

ఈ భూమి లోని మట్టి ఎంతో సార మైనది! 
 చెట్లు-కొండలు...నదులు-సముద్రాలు.. పసువులు, పక్షులు, పాములు ,
     సకలజీవరాసులూ ... ఈ భూమిపైననే పుట్టి, పెరుగు చున్నవి..! 

ఈ మట్టే...ఎన్నో రంగులు, రుచులు...వాసనలను యిచ్చు చున్నది..! 

మనల గన్న తల్లులు వేరు వేరై నా.... 
మనందరి జన్మలకూకారణమై.. 
మనలనం దరినీ  పెంచి, పోషించు తల్లి ఈ భూమాతయే....!! 

అందుకే...! అన్నారు పెద్దలు
 "జననీ , జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరీయసీ"
 అంటె... 
  మనల కన్న తల్లి... మన జన్మ భూమి ఆ స్వర్గము కంటె... 
 గొప్పవి అని...! 
   బోధ పడి0దా పిల్లలూ..!! 
       ******

కామెంట్‌లు