ఓం ఆదిత్యాయ- కొప్పరపు తాయారు
 ఏవముక్త్వా తదాగస్త్యో జగామ యథాగతమ్ 
ఏతచ్చ్రుత్వా మహాతేజా నష్టశోకోభవత్ తధా
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరంహర్షమవాప్తవాన్
 మహాతేజస్వియైన శ్రీరాముడు అగస్త్యమహాముని 
ద్వారా ఈ ఆదిత్యహృదయ మహిమను గ్రహించి 
చింతారహితుడయ్యెను. అతడు మిక్కలి సంతృప్తి 
పొంది ఏకాగ్రతతో ఆదిత్యహృదయ మంత్రమును 
మనస్సు నందు నిలుపుకొనెను.
 పిదమ ముమ్మారు ఆచమించి శుచియై   
సూర్యభగవానుని జూచుచు ఈ మంత్రమును 
జపించి పరమ సంతుష్టుడాయెను. పిమ్మట ఆ 
రఘువీరుడు తన ధనువును చేబూనెను
                    ****

కామెంట్‌లు