కవనజగతి;- గుండ్లపల్లి రాజేందప్రసాద్, భాగ్యనగరం
అక్షరాలు
అల్లుకుంటున్నాయి
పదాలు
పొంగిపొర్లుతున్నాయి

పంక్తులు
పేరుకుంటున్నాయి
ప్రాసలు
పొసుగుతున్నాయి

ఆలోచనలు
ఆవహిస్తున్నాయి
విషయాలు
వెంటబడుతున్నాయి

కాగితము
పరచుకుంటుంది
కలము
గీసుకొనిపోతుంది

కవితలు
కూరుతున్నాయి
మనసులు
మురుస్తున్నాయి

పత్రికలు
ప్రచురిస్తున్నాయి
పాఠకులు
పఠిస్తున్నారు

గాయకులు
పాడుతున్నారు
శ్రోతలు
సంతసిస్తున్నారు

పుటలు
నిండుతున్నాయి
పొత్తాలు
తయారవుతున్నాయి

సాహిత్యలోకము
సంపన్నమవుతుంది
పుస్తకప్రపంచము
ప్రకాశించిపోతుంది

జై జై
కవనజగతి
జయహో
సాహితీప్రగతి


కామెంట్‌లు