ఓం ఆదిత్యాయ ;- కొప్పరపు తాయారు
 సూర్యం సుందర లోకనాధ 
మమృతం వేదాన్ తసారం శివం
జ్ఞానం బ్రహ్మమయం సురేషమమలం 
లోకైక చిత్తం స్వయం
ఇంద్రాదిత్య నరాదీపం సురగురుం 
త్రైలోక్య చూడామణిమ్
విష్ణుబ్రహ్మశివస్వరూపహృదయం 
వందే సదాభాస్కరం
భానో భాస్కర మార్తాండ చండరష్మే 
దివాకర
ఆయురారోగ్య మైస్వర్యం విద్యాం 
దేహి నమోస్తుతే
రాఘవా!  ఈ స్తోత్రమును ఆపద 
సమయములలో, బాధలు, 
కష్టములు కలిగిన సమయములో, 
దిక్కుతోచక యున్నప్పుడు, భీతితో 
యున్నప్పుడు పఠించుట వలన 
ధైర్యము, స్థైర్యము కలుగును.
రాఘవా! దేవ దేవుడు, జగత్పతి 
యైన సూర్య భగవానుని ఏకాగ్ర 
చిత్తముతో పూజించుము. ఈ 
స్తోత్రమును మూడు మార్లు 
పఠించుట వలన నీకు ఈ 
యుద్ధములో విజయము కలుగును.
ఓ మహా బాహువులు కల రామా! 
నీకు ఈ క్షణము నుండి విజయమే. 
రావణుని వధించుము. అని చెప్పి 
అగస్త్యుడు తన యథా స్థానమునకు 
వెళ్ళెను.
ఇది విన్న రాముడు శోకమును, 
విచారమును వీడి, ప్రీతుడై, ధైర్యం 
పొందెను.
రాముడు సూర్యుని వైపు ఏకాగ్రతతో 
చూస్తూ ఈ స్తోత్రమును మూడు 
మార్లు పఠించి సచ్చిదానందు 
డయ్యెను. మూడు మార్లు 
ఆచమనము చేసి శుద్దుడై 
ధనుర్బాణములు ధరించెను.
రావణుడు యుద్ధమునకు వచ్చుట 
చూచి, ధైర్యముతో రాముడు 
రావణుని సంహరించుటకు సమస్త 
శక్తులు ఒడ్డుటకు కృత నిశ్చయము 
చేసుకొనెను.అప్పుడు, దేవతా 
సమూహముతో యుద్ధము 
తిలకించుచున్న సూర్యుడు, 
రావణుని మరణ సమయము 
ఆసన్నమైనదని గ్రహించి
 తనవైపు చూస్తున్న రామునిపై 
సంతుష్టుడై, ప్రసన్నమైన 
వదనముతో, రామా! ముందుకు 
సాగుము!  అని పలికెను.
                    *******
ఇంతటితో శ్రీ ఆదిత్య హృదయం
సమాప్తం దీనిని ప్రతీ రోజు స్నానం
అయినా వెంటనే చదివితే సర్వకార్యా లు  సిద్ధిస్తాయి.
    ఓం ఆదిత్యాయ

కామెంట్‌లు