సందేసం....! - కోరాడ నరహసింహా రావు,
  తన మనో క్షేత్ర0లో,విషయేంద్రి యాలు భావాల క్రో మో జోములై... అక్షర విత్తులుగా మొలకెత్తి నపుడు...., 
 ఆలా మొలకెత్తించట0 కోస0... కవి,అంతర్ మధనంతో...అమ్మతన0 లోకి పరకాయ ప్రవేశ0 చేసి... ఎంత ప్రాయాశ  పడతాడో ఆ కవి కే ఎరుక...! 
ఆ అక్షర మొలకలను పద పిండాలు గా తయారు చెయ్యట0 కోస0 ...తను ఎంత వేదన ననుభ విస్తాడో... ! 
 అది మరో కవితాత్మ తప్ప.. 
  వేరెవరు గ్రహించ గలరు..!! 
ఆ 'పద' పిండములను  వాక్య   శిశువులుగామార్చి,తనహృదయ క్షేత్రములో... హావ, భావ సొగసులద్ది ఆకట్టుకునే చక్కని రూపాన్నిచ్చి... అష్ట కష్టాలూపడి,ప్రసవించి,ఈ సాహితీ క్షేత్రముపై విహరింప చే య...,కవి అనుభ వించేది ఆ చ్ఛ0గా, అమ్మ  ప్రసవ వేదనే ! 
  నిజంగా సాహితీ ప్రక్రియలకు
  కన్న తల్లే. ...కవి!! 
      విషయాల తండ్రికి 'కవి'
తల్లికి... పుట్టిన సాహిత్యం
  సంస్కార వంతమై.. గుణ సహితమూ , దోష రహితమై నపుడే,   , 
   సమాజానికి యిచ్చును చక్కని సందేసం.....! 
     ******

కామెంట్‌లు