స్నేహ బంధం;- సి.హెచ్.ప్రతాప్
నా ముందు నడవకు
ఎందుకంటే నిన్ను అనుసరించలేను
నా వెనుక  నడవకు, నేను గమ్యం చూపలేను
నా పక్కనే నా చేతిలో చేయి వేసి నడువు
ఎందుకంటే నాతో పాటు జీవితాంతం
కలిసి నడిచే నువ్వు నా స్నేహితుడివి కాబట్టి

నీ గురించి సర్వం తెలిసినా
నిన్ను సర్వా కాల సర్వావస్థలయందు
ఒకే విధంగా ప్రేమించేవాడే స్నేహితుడు

కొత్త స్నేహితులను సంపాదించుకో,
కాని పాత స్నేహితులను విడువకు
స్నేహం అంటే రెండు శరీరాలలో వుండే ఒకే ఆత్మ

మనలకు జీవితాంతం తోడుగా వుండేందుకు
ఈ అనంత విశ్వంలో  మనకొక ఉనికి కల్పించి 

ఆనందానిచ్చేందుకు భగవంతుడు
దయతో పంపించిన దూతలే స్నేహితులు
నీ హృదయంలో పలికే అనురాగపూరిత
స్నేహమయ సంగీతాన్ని ఆస్వాదిస్తూ,
నువ్వు మాటల కోసం తడబడుతున్నప్పుడు,
అందుకునేవాడే నిజమైన స్నేహితుడు

కామెంట్‌లు