ఓం ఆదిత్యాయ ;- కొప్పరపు తాయారు
 ఆతపీ మండలీ మృత్యు: పింగళ:స్సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా: రక్త స్సర్వభవోద్భవః
నక్షత్రగ్రహతారాణా అధిపో విశ్వాభావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే 
నమః
జ్యోతిర్గణానాం పతయే  దినాధీపతయే నమః
  
వేడిని కలిగియుండు వాడు.వృత్తాకారమైన బింబము గలవాడు. విరోధులు రూపుమాపువాడు. 
ప్రభాతసమయమున 
పింగళవర్ణముకలిగియుండువాడు. 
మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను 
తపింపజేయువాడు. వ్యాకరణాది సమస్త 
శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును 
నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల 
ప్రాణులయందును అనురక్తి గలిగి యుండువాడు. 
సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు
నక్షత్రములకు, గ్రహములకు, తారలకును 
అధిపతియైనవాడు. విశ్వస్థితికి హేతువు. అగ్న్యాది 
తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. పన్నెండు 
రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో 
ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం. 
పూర్వగిరియందును, పశ్చిమగిరి యందును 
విలసిల్లుచుండువాడివి. గ్రహములకు, 
నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. 
ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ 
సూర్యభగవానుడా నీకు నమస్కారము.
                      *****

కామెంట్‌లు