సుపరిపాలన దినోత్సవం! గంగరాజు పద్మజ మలక్పేట

 భారతదేశ సుపరిపాలన దినోత్సవం
భారతీయ జనతకు ఆనందోత్సవం
అతులనీయమైన వ్యక్తిత్వ వికాసం
అటలమైన అనితరసాధ్యమైన
ఆత్మవిశ్వాసం
గెలుపు తప్ప అలుపెరుగని
జీవనయాగమే వాజపేయి యాగం
జన్మదాతలు కృష్ణ దేవి కృష్ణ బిహారీల జీవనం పావనం
గ్వాలియర్ లో జననం
హిందీ పత్రికలకు సంపాదకత్వం
కారాగారం కాదది! కార్యశూరుడి కావ్యోత్పత్తుల కర్మాగారం
ఆయన మాటలు చేతలు ప్రేరణతో సంచలనాలు
భారతీయ సంస్కృతికి కొలమానాలు
జై విజ్ఞాన్ ఆయన నినాదం
సదా స్మరణీయుడు భీష్మాచార్యుడు🌺
కామెంట్‌లు