అమెరికా బ్రిక్స్;- ఎం. వి. ఉమాదేవి.
ఆట వెలదులు 
=============
చిచ్చరపిడుగులుగ నచ్చెరువును జెంద
గాను మేధగలిగి గట్టిబొమ్మ 
 బ్రిక్సు తోడజేసి బిట్టున నవ్వేరు
నేటి బాలలకును సాటిలేరు!

చిన్ని చిన్ని ముక్కలెన్నియో నతుకంగ
నూహలోని రూపు నాహయనగ
బొమ్మజేసిమురిసి నమ్మకమొనరించె 
నాలుగేళ్ల శిశువు నయముగాను!!


కామెంట్‌లు