వికారాబాద్ జిల్లా ఎస్ ఎల్ బి విద్యార్థినిల కార్తీక వనభోజనం*- వెంకట్ మొలక ప్రతినిధి
 
-ఆవరణలోని మర్రిచెట్ల కింద మరుపురాని వనభోజనం
- తీపి జ్ఞాపకంగా తినిపించుకున్న స్నేహపర్వక ముద్దలు  

వికారాబాద్ : జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లి సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాల కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ గోపిశెట్టి రమణమ్మ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనం కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న ఈ పాఠశాలలో ప్రతి ఏటా జరుపుకునే 'వనభోజనం' ఈసారి 640 మంది విద్యార్థినిలు కార్తీక వనభోజనంగా  జరుపుకున్నారు. ఈ ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రమణమ్మ మాట్లాడుతూ వనభోజనం కార్యక్రమం తల్లిదండ్రులకు, కుటుంబాలకు చదువుకోసమై గురుకులంలో  ఉంటున్న విద్యార్థుల్లో స్నేహపూర్వక స్వభావాన్ని పెంచుతుందన్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామని బెంగను తీరుస్తూ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు తోటి విద్యార్థులకు స్నేహంగా ఆప్యాయతగా ఉంది వనభోజనం మానసిక విల్లాసంగా కలిగిస్తుందన్నారు. కార్తీక మాసంలో ఈ వనభోజనాన్ని నిర్వహిస్తుండడంతో ఆర్థిక వనభోజనం గా విద్యార్థుల్లో భక్తి పూర్వకాన్ని కలిగించామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవి మాట్లాడుతూ వనభోజనం కార్యక్రమం ఎస్ఎల్బీకే ప్రత్యేకమని ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ స్నేహపూర్వకం ఆనందం ఎంతో బాగున్నాయని అన్నారు. వనభోజనం కార్యక్రమం ఎస్ఎల్బీ విద్యార్థుల అదృష్టంగా భావించినట్లు ప్రశంసించారు. తరగతుల వారిగా మర్రి చెట్ల కింద సహా పంతి భోజనాలుకు కూర్చుని ప్రత్యేక వంటకాలతో వనభోజనం కార్యక్రమాల్ని ఆనందంగా నిర్వహించారు. స్నేహపూర్వకమైన స్వభావాన్ని చాటుకునేందుకు విద్యార్థులు ఒకరినొకరు ముద్దలు తెరిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బోధన సిబ్బంది కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


కామెంట్‌లు