సుప్రభాత కవిత ;- బృంద
చిరునవ్వు కత్తులతో
సమస్యలతో పోరాటం
చిరు గెలుపు  రాక కై
చూపులలో ఆరాటం

దిద్దుబాటు తప్పుకాదు
సహచరులకు సహకారం
సర్దుబాటు కూడా
సమస్యకు మరో పరిష్కారం

కరుకైన దారిలో
ఇరుకైన పయనం
ఒరులకు కాసింత
ఓదార్పు అవసరం

ఉంటే  చేసే సాయం కన్నా
ఉన్నంతలో చేసే సాయం మిన్న
మాటకు ఎంతో విలువ
మూటల  దానం కన్నా..

గెలుపు కోసం చేసే
ప్రయత్నాలన్నీ విజయాలే
వెరువక వేసే ముందడుగుకు
వీడని స్థైర్యం తోడుంటే!

లేనిది కావాలనుకోడం కన్నా
ఉన్నదే మనది అనుకుంటే
ఎనలేని సంతోషం
ఎదురులేని జీవనం

కొత్త పాఠాలు నేర్పే
కొంగొత్త ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు