తిరుప్పావై ;- కొప్పరపు తాయారు
    🌻5వ, పాశురం🌻
మాయనై  మన్ను, వడమదురై  మైన్దనై  త్తూయ
పెరునీర్  యమునైత్తురైవనై  ఆయర్ కులత్తినిల్ 
తోన్రుమ్  మణి విళక్కై  త్తాయైక్కుడల్  విళక్కుమ్
శెద్ధ  దామోదరనై తూయోమాయ్ వన్దు నామ్
తూమలర్  తూవిత్తాళుదు  వాయినాల్  పాడి
మనత్తినాల్  శిల్టిక్క పొయపిశైయుమ్
ప్పుగుదరువా  నిన్రనవుమ్  తీయనిల్  తూశాగుం 
 శెప్పేలో. రెమ్బావాయ్!!!
మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించాడు. బాగత్సంబంధంము ఎడ తెగనట్టి మధురకు మధుర ప్రభువే, యమునా నది తీర మందున్న గొల్ల కులమున జన్మించి ఆ గొల్ల కులాన్ని ప్రకాశింపజేసినవాడు. గొల్ల కుల మాణిక్య దీపము యశోద గర్భమును కాంతివంత మొనర్చిన దామోదరుడు. వ్రతకారణముగా శ్రీకృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలేవి కోరక పవిత్రమైన మనసులతో స్వామికి పూల నర్పించి నమస్కరించి నోరార  అతని కళ్యాణములను సంకీర్తనలు చేసి ధ్యానించిన సంచిత పాపములను ఇక ఆగామి పాపములను తప్పించుకొన వచ్చును అతని గుణ కీర్తనము చేయుట వలన పాపములన్నీ అగ్నిలో పడిన దూది వలె భస్మమై పోయెవే కావున స్వామి యొక్క తిరునామములను అనుసంధించుడు
                 *******

కామెంట్‌లు