అష్టాక్షరీ గీతి:-శ్రీకృష్ణ తత్వరహస్యము డా: కె. రామకృష్ణ .,కాకినాడ.

    కృపా సాగర! వరద!
   మతమేమో కనిపెట్టి
   మదం దించి బ్రోచేవట
   జయ కృష్ణ! కృష్ణ ప్రియ!
           🪷(2)
   నోగులను అణిచేసి
   యోగులను కాచేవట
   గోపికల్ని బ్రోచేవట
    జయ కృష్ణ! కృష్ణ ప్రియ!
           🪷(3)
    కాళిందు మదమణచి
    గోకులము కాచానని
    జన హృదయం దోచావు
    జయ కృష్ణ! కృష్ణ ప్రియ!
           🪷(4)
    ధన్య జీవి యశోదమ్మ
    సర్వ లోక సచిత్రాన్ని
   నోటిలోనే చూపేవట
   జయ కృష్ణ! కృష్ణ ప్రియ!
              🪷(5)
    మడుగు నిచ్చి సభలో
    పాండు సుతుల దేవేరి
    మానరక్ష జేచేవట
    జయ కృష్ణ! కృష్ణ ప్రియ!
             🪷(6)
    విప్పినట్లు నటియించి
    భక్తులకే ముడు లెట్టు
     నట సూత్రధారి వట!
     జయ కృష్ణ! కృష్ణ ప్రియ!
        
🚩కృష్ణం వందే జగద్గురుమ్!
కామెంట్‌లు