సాంఘికశాస్త్ర ఫోరం సహకార్యదర్శిగా తిరుమలరావు.

 సాంఘికశాస్త్ర సమున్నతికి, విద్యార్థులకు గుణాత్మక విద్యాసాధనకు
ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్రోపాధ్యాయుల ఫోరం పదిమందితో ఏర్పడగా, ఆ కార్యవర్గంలో సహకార్యదర్శిగా వోని ఎంపియుపి పాఠశాల సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు ఎంపికయ్యారు. 
శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలం, కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న తిరుమలరావు, ఇటీవల జరిగిన పనిసర్దుబాటు డెప్యుటేషన్ పై  వోని పాఠశాలకు తాత్కాలిక బదిలీపై నియమితులయ్యారు.
ఎ పి ఎస్ ఎస్ టి ఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 
తలవరం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో గల వీరఘట్టం, పాలకొండ మండలాలకు చెందిన సాంఘిక శాస్త్రోపాధ్యాయులంతా సమావేశమై, ఈ ఫోరంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 
రాష్ట్రస్థాయిలో ఉన్న ఈ సంఘానికి
స్కూల్ కాంప్లెక్స్ ల వారీగా అనుబంధసంస్థలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, తలవరం స్కూల్ కాంప్లెక్స్ శాఖ కార్యవర్గంలో తిరుమలరావు సహకార్యదర్శిగా ఎంపికయ్యారు. 
17.06.1989 వ తేదీన సెకండరీ గ్రేడ్ టీచర్ గా ఉద్యోగంలో చేరిన తిరుమలరావు, 30సంవత్సరాల మూడునెలల తర్వాత  13.09.2019న, సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పదోన్నతి పొందారు.
గత నాలుగేళ్లుగా సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న తిరుమలరావు, సహకార్యదర్శిగా
ఎంపికగుట పట్ల పలువురు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తంచేసారు.
మాచర్ల రఘునాథదొర,  
రౌతు గౌరీశంకరరావు, 
గొడబ విజయభాస్కర్, 
పెయ్యల హేమలత,  
ఎం.స్వర్ణలత,  
పోతురాజు శంకరరావు, 
బౌరోతు మల్లేశ్వరరావు, ఎస్.నానిబాబు,  
వూలక రవి తదితరులు తిరుమలరావును అభినందించారు.
కామెంట్‌లు