కర్ణుని పూర్వజన్మ! అచ్యుతుని రాజ్యశ్రీ

 మహాభారతంలో దురదృష్టవంతుడైన వ్యక్తి కర్ణుడు.
కర్ణుడు లేనిదే భారతయుద్ధం జరిగేది కాదు.ఎన్నో మంచిగుణాలు దానధర్మాలు చేసిన కర్ణుడు పుట్టీపుట్టగానే  కన్యయైన కుంతీదేవి కి నవమాసాలు మోసే పనిలేకుండా సూర్యుని వరప్రసాదం గా సహజకవచం కుండలాలతో జన్మించాడు.చాలా అందగాడు ఆజానుబాహుడు తెల్ల మద్ది చెట్టు లా ఆకర్షణ కల్గిన వాడు అని భారతంలో వర్ణింపబడినాడు.ధర్మరాజు యమధర్మరాజు అంశతో 
పుట్టిన సుగుణాలు రాశి.సూర్యసంబంధంగా ఇద్దరూ అన్నదమ్ములే.కానీ పాండవులకి తెలీదు.అసలు పూర్వజన్మ లో కర్ణుడు రాక్షసుడు.వెయ్యికవచాలు 
కుండలాలు కల్గిన గొప్ప తపస్సు చేసిన వాడు.అతన్ని చంపాలంటే వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే ఒకకవచం కుండలం పోతాయి.మళ్ళీ వేయి ఏళ్ళు తపస్సు చేస్తే ఇలా ఒక్కొక్క టి పోతాయి.ఆఖరికి ఒకే ఒక్క కవచం తో మిగులుతాడు.అందుకే నరనారాయణులు వెయ్యి ఏళ్ళు వంతులప్రకారం ఒకరు తపస్సు ఇంకొకరు యుద్ధం చేస్తూ 999 పూర్తి చేశారు.ఆఖరుకి నరుడు 
అర్జునుడు గా నారాయణుడు కృష్ణునిగా పుట్టి కర్ణుని
పడగొట్టారు.ఎవరికైనా మృత్యువు తప్పదు.అంతటి
గొప్ప వారి చేతిలో మరణించాడు కర్ణుడు.
కామెంట్‌లు