అష్టాక్షరిగీతి, కవితాప్రక్రియ:- గోవర్ధన గిరిధారి - "శ్రీ చందన" జగదీశ్వరి కందికుప్ప.
 కుచేలుననుగ్రహించి
చెలిమిని నిలబెట్టి
జగతికి దారిచూపె
జయ కృష్ణ! కృష్ణ ప్రియ!
         🪷(2)
మొరవిని శీఘ్రగతి
వలువలనిడి కృష్ణను
గారవమున రక్షించె
జయ కృష్ణ! కృష్ణ ప్రియ!
           🪷(3)
గోవర్ధనగిరినెత్తి
గోకులమును కాపాడి
శ్రీలిడు గిరిపూజల
జయ కృష్ణ! కృష్ణ ప్రియ!  
         🪷(4)
కాళీయు గర్వమణచి
సుందర తాండవమాడే
ఆనంద సాగర! నమో!!
జయ కృష్ణ! కృష్ణ ప్రియ!
🚩కృష్ణం వందే జగద్గురుమ్!

కామెంట్‌లు