సహాయం- పూజా- ఎనిమిదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9311244843

 అనగనగా నాగపురి అనే ఊర్లో చిన్న కుటుంబం ఉండేది. కిషన్, చాంది అనే దంపతులు ఉండేవారు. వారికి మధు, సింధు అనే కుమారుడు, కుమార్తె ఉండేవారు. ఇద్దరు చదువుకుంటూ ఉండేవారు. అప్పుడప్పుడు పొలం పనుల్లో తల్లిదండ్రులకు సహాయం చేసేవారు. ఒక రోజు ఇద్దరూ పొలం వద్దకు వెళ్లారు. పొలం పనులు చేస్తూ చేస్తూ, పక్క పొలం వద్దకు వెళ్లారు. అక్కడ ఒక చెట్టు క్రింద తెలిసిన పక్క పొలం ముసలి అవ్వ కండ్లు తిరిగి పడిపోయింది. అక్కడ ఎవ్వరూ లేరు.
               ఇద్దరూ కూడా ముసలి అవ్వను చూసి, పరుగున వెళ్లి లేపి కూర్చోబెట్టి, నీళ్ళు తాగిపించారు. ముసలి అవ్వ మెల్లగా కండ్లు తెరిచింది. అవ్వ ఏమైందని అడిగారు. నేను తెచ్చుకున్న సద్ది ఆకలితో ఉన్న కుక్కకు పెట్టాను. నేను తినకపోవడం మూలంగా పడిపోయానేమో అని అన్నది. ఇద్దరు కూడా చాలా బాధపడ్డారు. తాము తెచ్చుకున్న సద్ది ముసలి అవ్వకు తినిపించి, ఇంటికి తీసుకువెళ్లారు. ఇంటికి వెళ్లాక ముసలివ్వ వారికి వంట చేసి కడుపునిండా భోజనం పెట్టి వారింటికి పంపించింది.
నీతి: మనము ఎదుటివారికి సహాయం చేస్తే, ఆ సహాయం జీవితాంతం గుర్తుంటుంది.

కామెంట్‌లు