చదువు;-యస్. రేణుక-ఎనిమిదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9885668665
 సింగరాయి అనే గ్రామంలో వీరయ్య, రాజేశ్వరి అనే పేద దంపతులు ఉండేవారు. వారికి చాలా కాలం తర్వాత ఒక కూతురు జన్మించింది. ఆ కూతురుకి రాణి అని నామకరణం చేశారు. కొద్దిరోజుల తర్వాత వీరయ్య చనిపోవడం జరిగింది. రాజేశ్వరి కూతురు రాణిని అల్లారుముద్దుగా పెంచసాగింది. రాణి పాఠశాలకు వెళ్లి చదువుకుంటూనే సెలవు రోజులలో తల్లి రాజేశ్వరితో కూలీ పనులకు వెళ్లి సహాయపడేది. తల్లి రాజేశ్వరి ఎంత చెప్పినా కూలీ పనులు చేస్తూనే రాణి చదువుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటుంది. చదువులలో, ఆటలలో కూడా రాణి మొదటగా నిలుస్తూ ఉండేది.
                 రాణి తమ ఊరిలోనే పదవ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందింది. గ్రామస్తులందరూ రాణికి పెండ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టుమని రాజేశ్వరికి ఎంతగానో చెప్పసాగారు. కానీ రాజేశ్వరి మాత్రం పట్నంలో రాణిని పైచదువులు చదివించింది. రాజేశ్వరికి ఎంత కష్టమైనా పనులు చేస్తూ రాణిని చదివిస్తుంది. రాణి కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో చేరింది. రాణి ఉద్యోగం చేస్తూనే పట్నంలో ఇల్లు తీసుకుని, తల్లి రాజేశ్వరిని చక్కగా చూసుకోసాగింది. రాజేశ్వరి కష్టపడి కూతుర్ని పెంచడం. రాణి చక్కగా చదువుకొని ఉద్యోగం చేయడం తెలుసుకున్న గ్రామస్తులు కూడా ఆడపిల్లలకు చిన్నతనంలో పెండ్లి చేయడం మాన్పించి, ఆడపిల్లలను పట్నంలో పైచదువులు చదివించసాగారు.


కామెంట్‌లు