లలిత గీతం :- (సంక్రా0తి) ;- కోరాడ నరసింహా రావు..!
 పల్లవి:-
నెలగంట కొట్టినారట నెల రోజుల ముందుగా.... ! 
హరిలో  హరి రంగ యనుచు... 
 ఘల్లు  ఘల్లు న కాలి గజ్జలు 
 చేత చిరతలు వాయిస్తో
చెవుల కింపగు కీ ర్త న లు .... 
 వే కువనె..విని పించె నదిగో ! 
  హరిదాసు .....కని పించె నదిగో.... !! ... 2
సంక్రా0తి  సోయగాల్ మొద లాయె న హొ హో....! 
 సంక్రా0తి సోయ గాల్ మొద లాయె న హొ హో...!! 
     " సంక్రా0తి సోయ గాల్.. "
చరణం:-
అద్దు కున్న అందాలతొఊరు - వాడా , మెరయు చున్నది ! 
బోగీ కర్రలను దండగ, పిల్ల గుంపులు బయలు దేరెను ! 
 అమ్మలు - అక్కలు ,ఆవుపేడ తొ అందమైన భోగిపిడకలు చేయు చుండిరి...! 
 యెడ్ల బల్లలా... దాన్య లక్ష్మి
 రైతు లిళ్లకు చేరు చున్నది..! 
    " సంక్రా0తి సోయగాల్... "
చరణం:-
పిన్న, పెద్ద లంత కలిసి భోగి మంటలు వేసినారు..! 
మంట చుట్టు చేరి పిల్లల కేరింతలు ..., 
  అభ్యంగన స్నానాలు , వేడి- వేడి కుడుముల ....అల్పాహారా లు ...,ఆటలూ , పాటలూ.... 
చిట్టి తల్లుల - బుజ్జి బాబుల 
భోగిపాళ్ల సందడి...!! 
      " సంక్రా0తి సోయ గాల్... "
చరణం :-
సంక్రా0తి,పుణ్య కాలపు వేకువ.... 
పడతు లందరి ముఖములు పసుపు, కుంకుమలే..., 
పేరు- పేరు నా ... పొత్తర్లు , ఉపారాలు, కొత్త బట్ట లూ.... భక్తి - శ్రద్దలతో పెద్దలకు సత్కారాలు...! 
 పెద్ద లంద రు సంక్రా0తిన దీ వించును వారసులను...!! 
 పసువుల  పూజలు... విందులు, వినోదాలు... ఆట, పాటలు , ఆనం

దాల కనుమ పండుగ జరుపు కొందుము
 మూడు రోజులు ముచ్చటగ జరుపు కొందుము హిందువులమూ... రండి -  రండి మిత్రు లారా... ఆనందం
పంచు కొండి.... మాతో ఆనం దం పంచు కొండి...!! 
     *******
కామెంట్‌లు