"నూతన వత్సరం-2024" సందేశం;--గద్వాల సోమన్న,9966414580
క్యాలెండర్ మారితే
కాదు కాదు క్రొత్తదనం
సుగుణాలే అబ్బితే
అదే కదా చక్కదనం

పేజీలే త్రిప్పినా
ఏమున్నది గొప్పదనం?
బ్రతుకుల్లో  దశ తిరిగిన
అప్పుడేనోయ్! శుభదినం

సంవత్సరాలు గడిచినా
మార్పు ఏమి లేకుంటే
ఉన్నదా !ఇక ఫాయిదా?
జర యోచించ రాదా!

పాత యేడు చేదు  చేదు
అనుభవాలు తరిమికొట్టు
"కొత్త వత్సరం-2024" లో
సరికొత్తగా మొదలెట్టు
.

కామెంట్‌లు