అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 కొండపైకి వెళ్లేసరికి అందరికీ బాగా అలుపు వచ్చింది  ఇంతలోనే ఆ ఊరి అబ్బాయితో రమణ గారి నుంచి పిలుపు కూర్చున్నంతసేపట్లోనే మళ్లీ లేచి ఒక మూలగా పైకి చేరుకున్నారు. అక్కడ ఒక శిధిల శివాలయం క్రీస్తు శకం 11-12 శతాబ్దాల చోలులనాటి దేవాలయం లింగం ఒంగింది కప్పు లేచిపోయింది మనుషులకైతే రకరకాల ఇళ్లు, పధకాలు ఉన్నాయి. ఎందుకంటే వారికి ఓట్లు ఉన్నాయి దేవుళ్లకు ఓట్లు లేవుగా అందుకే వారికి ఈ ఇళ్ల పథకాలు లేక ఇలా కునారిల్లుతున్నాయి. సార్ ఇక్కడికి రండి ఈ ఇనుప యుగపు సమాధి ఉందని మరో పిలుపు చిన్న రాళ్ళు మంచం కాడలా పేర్చి పైన ఒక బండనమర్చి మరణించిన వారి అస్తికలకు ఆచ్యాదన ఏర్పాటు చేశారు. క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరముల నాటి మానవులు ఇనుమును కనుగొని పనిముట్లతో రాయిని తొలగించి చనిపోయిన వారి మీద గౌరవంతో గుర్తుగా కలిసికట్టుగా కట్టుకున్న సమాధి గూడు కప్పు బడి కింద చిన్న చిన్న వర్ణ చిత్రాలు ఆనాటి మానవుని ఆలోచన అధ్యయనం సమాచారం ప్రసరణకు అద్దం పడుతున్నాయి. ఇలాంటి సమాధులు కొండ చేరియపోయిన చాలా ఉండేవని చరిత్రపై అవగాహన లేని స్థానికులు కోసం చేశారని ఉన్న ఈ ఒక్కదాని అయినా కాపాడుకోవాలని రమణగారు రెడ్డి గారిని బ్రతిమలాడారు  వారి భాషను కూడా రెడ్డి గారు కూడా భరించారు  పేపర్ వార్త ద్వారా ప్రభుత్వానికి తెలియజేశారు రెడ్డి గారు ఇంతవరకు అలికలు లేదు ఈ సమాధిని గతంలోనే రమణగారు చూశారట అంతకు ముందు చాలామంది పరిశోధకులు చూశారు అయినా ఈ తరానికి తెలియజేయడం రెడ్డి గారు తన బాధ్యతగా గుర్తించారు  తరువాత అదే గుట్ట మీద నాకు కొండ చర్యలు పరిశీలించారు ఏమైనా శిలాయుగపు చిత్రాలు దొరుకుతాయేమోనని లేవు లేనందుకు బాధపడలేదు ప్రయత్నం చేశాము మన తృప్తి మాత్రం మిగిలింది అక్కడి నుంచి చక్కటి ప్రకృతిని చూశారు చూపు కొంచెం కిందకి మళ్ళింది ఆశ్చర్యం.
నేలమట్టానికి కొండ శిఖరాగడానికి మధ్య మొత్తంలో ఉన్న ఒక పెద్ద రాతి గుండెపై గర్భాలయం అష్టమండపం వరకు రాయి ఆ పైన ఇటుకతో కట్టిన విజయనగర కాలపు చక్కటి ప్రాసాదం కనిపించాయి  ఆ సెలయేటి ఒడ్డున కొండ దిగువన ప్రకృతి అందచందాల నడుమ ఏ మహనీయుడు ఆ ఆలయాన్ని నిర్మించాడో తెలియదు కానీ  ఆయనకు నమస్కరించారు  రెడ్డిగారు రమణగారు రెడ్డిగారు వెనక్కి తిరిగారు తిరుపతి చేరేంతవరకు చూసిన కట్టడాలు వారిని ప్రశ్నలతో వేధిస్తున్నాయి ఆ ప్రశ్నలు హోటల్లో సేద తీరే వారి బృందాన్ని బాధిస్తున్నాయి వారసత్వం వారసత్వంతోందని హెచ్చరిస్తున్నాయి  ఒక విషయాన్ని గురించి  తెలుసుకొని  దానిని నలుగురకు తెలియపరిచి వెలుగులోకి తీసుకురావడానికి  నిజాయితీ కలిగిన వ్యక్తి శివనాగిరెడ్డి గారి కృషి  ఎంత ఉన్నదో  ఈ ప్రకరణలో తెలుస్తుంది.


కామెంట్‌లు