చిట్టి చింటూ రారండీ!
చిలుకలను పలకరిద్దాము!
చిలుకలతోని మాటలు కలిపి
చింతచిగురును కోద్దాము!
బుల్లీ బుజ్జీ రారండీ!
బాబాయి వద్దకు వెళదాము!
బాబాయి తీసిన గౌన్లు తొడిగి
బలే చక్కగా తిరుగుదము!
రాజూ రాణీ రారండీ!
రాముని పలకరిద్దాము!
రామూ ఇచ్చిన పండ్లను మనము
రాగం తీస్తూ తిందాము!
పారూ చారూ రారండీ!
పింకీ వద్దకు వెళదాము !
పింకీ చేసిన అల్లరి చూసీ
పకపకా నవ్వేద్దాము!
చిచ్చూ చిన్నూ రారండీ!
చేమంతులను కోద్దాము!
చేమంతులను దేవుని కిచ్చి
చక్కగా మురిసిపోదాము!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి