ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 విశాఖపట్నంలో నేను  కార్యక్రమాలు చేస్తున్న రోజుల్లో భైరవయ్య గారు నాకు పరిచయమయ్యారు  నా ఆత్మీయుడు మధుసూదన్  వారిని పరిచయం చేశారు  మంచి సాహితీవేత్త  అనేక  అభ్యుదయ కవితలను రాసి సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి  అనేక ఉద్యమాలలో  పాల్గొని  అనేక కార్యక్రమాలను నిర్వహించిన వారు  మాకు కవితలు  చదివేవారు  కొన్ని వ్యాసాలు కూడా చదివారు  వారి భాష చాలా అందంగా ఉంటుంది  అక్కడ మేము సత్యవాడ చౌదరి మడులతో కలిసి నెలవారీ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం  ఒక్కొక్క నెల ఒక్కొక్క అంశాన్ని తీసుకుని  ఒక మంచి సాహితీవేత్తను అధ్యక్షునిగా పిలిచి  వారి ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేవాళ్ళం  ఒకరోజు నాన్నగారు రాజుగారిని కూడా పిలిచి కార్యక్రమం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాం.
ఆరోజు అధ్యక్షుడుగా ఉన్న నాన్నగారు నన్ను  ఆధ్యాత్మిక విషయాన్ని  భౌతికంగా  చెప్పమన్నారు  నేను తపస్సు అన్న అంశాన్ని తీసుకొని  అసలు తపస్సు అంటే ఏమిటి ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు  అన్న విషయాలను తెలియజేయటం  తపః  అంటే తన అహంకారాన్ని దహించుకునేవాడు  ప్రతి వ్యక్తిని  అరిషడ్ వర్గాలు వేధిస్తూ ఉంటాయి  వాటికి దూరంగా వెళ్లడానికి  మనసును ఏకాగ్రంగా ఉంచడానికి  భగవంతుని కానీ భగవతిని కానీ దృష్టిలో పెట్టుకొని వారి కోసం  తప్ప మరో ఆలోచన లేకుండా చేయడం  ఎప్పుడు పద్మాసనం వేసుకుని తపస్సు చేయడానికి ప్రారంభిస్తాడో  అలాంటి ముని తపస్సును భగ్నం చేయడానికి స్వర్గలోకంలో ఉన్న రంభ ఊర్వశి మేనక తిలోత్తమ  వచ్చి వీరి మనసును వికలం చేసి  వారి  మనసును ఏకాగ్రత నుంచి మళ్ళించడం కోసం ప్రయత్నం చేయడం. ఎంతో కాలం తపస్సు చేసిన విశ్వామిత్రుల వారికే  ఈ బాధ తప్పలేదు మేనకతో  తన తపస్సు భగ్నం కావడం విశేషం  నిజానికి దానివల్ల మంచే జరిగింది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు  మేనక ద్వారా శకుంతల గనక  ఈ భూమి మీదకు రాక పోతే  భారతదేశ చరిత్రలో ఒక పుట లేకపోయినట్లే లెక్క  దీన్ని భౌతికంగా చెప్పడం కోసం ప్రయత్నం చేశాను  మొదట తపస్సు చేయడానికి పద్మా సనంలో కూర్చున్న వ్యక్తికి  కాళ్లు తిమ్మిరి అవుతాయి  తమ తప్పుతుంది  మనసును తన అధినంలో ఉంచుకోలేరు  ఆ కాళ్ళను రెంటిని అటు ఇటు జరుపుకుంటూ దీనిపైనే ధ్యాస ఉండడం  తపస్సును భగ్నం  చేయడం  కింద లెక్క  ఇది రంభ చేసిన పని అని పెద్దది చెబుతారు  మనిషి నితంబాన్ని (తొడను)  రంభతో పోలుస్తారు  అరటి మొదలు ఎలా ఉంటుందో  మనిషి నితంబం అలా ఉంటుంది కనుక దానిని రంభ అంటారు.
కామెంట్‌లు