అహల్య;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 ఈ తపస్సులో వేల సంవత్సరాలు గడిచినాయి కానీ ఎలాంటి మార్పు లేదు అకస్మాత్తుగా ఒక రోజు ఇంద్రుడు గౌతముని ఆశ్రమాన్ని దర్శిస్తాడు కానీ గౌతముడు ఆశ్రమంలో లేడు లోకోత్తర సుందరుడగు ఇంద్రుని సౌందర్యాన్ని చూసి అహల్య ఒక్క క్షణం బలహీనురాలయింది  అప్సరసరల హృదయాన్ని దోచుకున్న దేవేంద్రుడు  స్వయంగా అహల్య ముందర విలాస వంతమైన క్షణాల కోసం వచ్చి నిలబడితే అహల్య ఇంద్రుని కుతూహలాన్ని శాంతింప జేయడానికి ఉద్యుక్తురాలు అయ్యింది.  ఆ సమయంలో బ్రహ్మచర్య తపస్సులో ఉన్న గౌతముడు ఆశ్రమములకు రాక ఇంద్రా అహల్య ఇద్దరు కలిసి  ఉన్న పరిస్థితి గమనించిన మహర్షి గౌతమణి ప్రజల కోపానికి కారణభూతుడైనారు అహల్య కు ఈ విషయంలో అనుమానం ఉంది అందుచేత  ఇంద్రునికి వీడ్కోలు చెప్పే సమయంలో మిమ్మల్ని మీరు నన్ను రక్షించండి కానీ ఇద్దరిలో ఒకరు బ్రతికి బటకట్టలేదు ఇంద్రుడు వికృతాకారుడు అవుతాడు  ఈ కథ చాలా చిన్నది కానీ సారగర్భితము రసాస్వత్మకము అయి ఉన్నది ఇందులోని వాస్తవ విషయాన్ని గ్రహించలేని అజ్ఞానులు అనేక విధాలుగా  వ్యాఖ్యానించారు రాముని కావ్య పరంపరలో అహల్య చరిత్ర అనేక విధాలుగా జరిగింది  ప్రతివాడు తన కల్పన చాతుర్యం పరమ పవిత్రురాలిగా వివరించారు ఇక్కడ జరిగిన అనైతిక కార్యానికి జరిగిన మూల కారణం దేవేంద్రుడే యని విస్మరించారు ఇంద్రుడు గౌతమ ఆశ్రమ ప్రవేశాన్ని అనేక విధాలుగా వర్ణించారు కొంతమంది గౌతముని మారు రూపంలో వచ్చాడంటే మరికొందరు కోడిపుంజు రూపంలో అర్ధ రాత్రి ఆశ్రమంలోకి వచ్చాడు అన్నారు. కోడికొక్కరొకో  శబ్దానివిని గౌతముడు నది స్నానానికి వేకువనే వెళతాడు అదే అతను అనుకొని ఇంద్రుడు అక్కడకు వస్తాడు ఈ కల్పన చదవడానికి బాగానే ఉంటుంది కానీ వాస్తవానికి చాలా దూరం. వాల్మీకి మహర్షికి  ఇలాంటి అసంభవమైన ఆలోచనలు రానే రావు. అహల్య శాప విషయం కూడా వాల్మీకికి గల ఆలోచనా రీతిలో తర్వాతి కవుల రచన తీరులో అంతరం కనిపిస్తోంది వాల్మీకి తరువాత రామాయణ కథ అందరూ కల్పించినట్లు వాల్మీకి అహల్యను శిలగా మార్చలేదు. అహల్యను రాయిగా చేసినట్లు ఆ రాతిని రాముడు తన పాదాన్ని మోపగానే స్త్రీగా అవతరించినట్లు అది చూసిన రాముడు భయపడితే ఆయనను నౌక మీద కూర్చొని పెట్టుటకు కేవట్ సంకోచించినట్లు ఎలాంటి విషయాలన్నీ కూడా అన్ని రామకావ్యాల్లో ఉల్లేఖించబడినవే ఒక వాల్మీకి మహర్షి మాత్రమే  ఆ విధంగా చూడలేదు.
కామెంట్‌లు