అమ్మ జననికి జన్మభూమికి సేవలు చేయని జన్మ ఒక జన్మేనా అమ్మా నీకు మేము ఇద్దరం కొడుకులం నిన్ను చూడడానికి నీ మంచి చెడులన్నీ గమనించటానికి నా తమ్ముని ఇక్కడ ఉంచి నన్ను దేశసేవ చేయడానికి దేశమాత కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న ఈ కుమారుడు వీరుడుగా నిలబడాలని మనసులో ఎలాంటి చింత లేకుండా మనసును భద్రపరచుకొని వీరమాతగా నన్ను వెళ్లి రమ్మని దీవించమ్మా అని ప్రార్థించాడు. ఆ రోజు దేవి సుభద్ర పద్మ వ్యూహము చీల్చి పోరాడమని అభిమన్యుని దీవించి పంపలేదా అమ్మా పలనాటి యుద్ధ సమయంలో బాలచంద్రుని దీవించి పంపగా పసుపు ముద్దని పెట్టి పాలు విరిగేట్టు చేసి వైరి వీరులతో పోరాడమని ఆంధ్ర మాతగా ఆనాటి ఖడ్గ తిక్కనను దీవించి పంపించలేదా. వారి కథలన్నీ చరిత్రగా నీవే కదమ్మా మాకు చెప్పి మాలో దేశభక్తిని పురి కొల్పింది. నీ మాటల స్ఫూర్తితోనే నేను వెళ్లి దేశమాత దాస్య శృంఖలాలను తెంచి వస్తాను నన్ను దేశ సేవకు రణము చేయడానికి పంపించు నిన్ను అందరూ వీరమాత అంటూ కీర్తిస్తారు అమ్మా నన్ను నమ్ము అన్న మాటలు వీర తల్లి తన బిడ్డను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని కౌగిలించి శిరస్సును ముద్దిడి గుండె చెరువు కాక కన్నుల నిండా నీళ్లు నిండగా మనసును కుదుటపరచుకొని ఆ కన్నతల్లి చివరకు దీవించి పంపించింది. తల్లిని చెల్లిని తన తమ్ముని వదిలి వెళ్ళడానికి నిర్ణయించుకున్న రాజు గారిని తన తల్లి మోగల్లు వరకు తోడుగా తన రెండవ కుమారుని పంపించింది. అక్కడకు వెళ్ళిన తరువాత అధికారులకు ఒక లేఖ వ్రాశాడు రామరాజు కరుణతో మీరు నాకు ఇచ్చిన భూమిని తిరిగి మీకు ఇస్తున్నాను సన్యసించిన నాకు ఈ భూములు ఎందుకు నేను పర్వత ప్రాంతాలకు వెళ్లి సన్యాసినయి తపస్సు చేసుకుంటూ జీవిస్తాను అన్న లేఖ చూసి అధికారులు పీడ వదిలిపోయింది ఇక మన్యమంతా మనదే వారికి దిక్కులేదు అంటూ ఎంతో ఆనందించి విందులు వినోదాలతో కాలాన్ని గడిపారు ఆ తరువాత ధీరమూర్తి అయిన రామరాజు తమ ఇళ్ళను పొలాలను మొత్తం వారికి స్వాధినం చేసి తమ మనసు నిండా వీర రక్తాన్ని నింపి వీర రణ రంగానికి వారి ఎత్తుల జిత్తులన్నిటిని తిరిగి వారికి చేరేట్లుగా తమ సోదరులందరికీ ధైర్య స్త్యేర్యాల నుండి పాపికొండల ప్రాంతానికి బయలుదేరాడు అక్కడ అడవి ప్రాంతంలో తమ నివాసం ఏర్పాటు చేసుకున్నారు రహస్య స్థావరంగా దానిని ఎన్నుకున్నారు.
ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి