ఓర్పు దివ్యౌషధం;- -గద్వాల సోమన్న,9966414580
ఓర్పు ఎంతో గొప్పది
కల్గియుంటే మంచిది
అభివృద్ధి సాధనకు
విజయోత్సవ గీతికకు

ఓర్పు లేని జీవితం
స్థిరత లేని సాగరం
ఆనందమే ఉండదు
అనుకున్నదిల జరగదు

ఓర్పు గొప్ప ఆయుధం
అన్నింటికాధారం
సహనంతో సమస్తం
గెలుపన్నది ఖచ్చితం

ఓర్పుయే దివ్యౌషధం
సమకూర్చును ఆరోగ్యం
పనులన్ని సఫలీకృతం
బ్రతుకగును తృప్తికరం

ఓర్పు ఆశించునోయ్!
మార్పు నడవడిలోన
ఉన్నతంగా ఎదగాలని
నేర్పుతో జీవితాన


కామెంట్‌లు