అమాయక పిల్లలు;- -గద్వాల సోమన్న,9966414580
అభంశుభమెరుగని వారు
అమాయకపు చిన్నారులు
అదరహో! వారి జగత్తు
మనసు తిలకింప మహత్తు

పలుకులేమో గమ్మత్తు
కావు కావు అవి విపత్తు
అక్షరాల మహా సొత్తు
ఆమోఘము వారి పొత్తు

అసలు లేవు నక్క జిత్తులు
అఖండ జ్యోతిలా మనసులు
ఆణిముత్యాలు వాక్కులు
అమృత తుల్యులు పిల్లలు

అసూయ ద్వేషాలు లేవు
అనుచిత వైఖరి లేదు
అంతరంగం పవిత్రం
కల్తీ లేదు ఏమాత్రం


కామెంట్‌లు