స్ఫూర్తి దాతలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 కేరళ యువతి రెహానా షాజహా ఆన్లైన్ ద్వారా 24 గంటల్లో 81 ఆన్లైన్ సర్టిఫికెట్స్ పొంది రికార్డు సృష్టించింది.ఒకప్పుడు జామియా మిలియా ఇస్లామియాలో ఎం.కాం.సీటు ఒకే ఒక్క అరమార్కు లేక రాలేదు.కృషి దీక్ష తో కాట్ పాసైంది. ఆమెకు రోల్ మోడల్ సోదరి నేహలా!ఆమె చెల్లిని ఎథా అని పిలుస్తుంది.నేహలా ఢిల్లీ లోఆపరేషనల్ రిసెర్చ్ లో మాస్టర్ డిగ్రీ పొంది లండన్లో జాబ్ చేస్తోంది. అక్కలాగా  రెహానా చదువులో చురుగ్గా ఒకేసారి రెండు పీ.జీ.లుచేసి ఢిల్లీ లో ఓ ఎన్ జీఓ.తో కల్సి పని చేస్తున్నారు.తండ్రికోసం ఆమె దుబైలో మంచి ఉద్యోగం వదిలేసి ఢిల్లీ వచ్చింది.ఈమె భర్త ఐ.టి.ఇంజనీర్.అమ్మ నాన్న భర్తతో కలిసి ఉంటూ ఇంతసాధించింది🌹
టాయిలెట్ లేడీ అని ఆమెను అంతా గేలిచేసినా పట్టించుకోలేదామె.ఓ ఆర్కిటెక్ట్ గా లండన్ లో మాస్టర్స్ చేసిన ఆమె మురికి వాడల బస్తీలలో27 వేల మరుగుదొడ్లు నిర్మించిన ఘనత ఆమెది.స్వచ్ఛభారత్ కి ఊపిరి ఐంది.మహా
రాష్ట్రలోని పింప్రీ  సాంగ్లీ మొదలైన ప్రాంతాల్లో మురుగు కాలువలు సెప్టిక్ ట్యాంక్ లనిర్మాణం ఆమె ప్రతిభకు నిదర్శనం.ఆమెయే ప్రతిమాజోషీ🌹
కామెంట్‌లు