కడుము పాఠశాలకు ఎస్.ఎస్.సి మోడల్ టెస్టుపేపర్ బహూకరణ.

 ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటీఎఫ్) రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలలకు పదోతరగతి మోడల్ టెస్ట్ పేపర్ లను ఉచితంగా పంపిణీ గావిస్తున్న నేపథ్యంలో
కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నేడు అందజేసారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు తెలిపారు.
గత పదేళ్ల నుంచి ఇలా పదవతరగతి విద్యార్థులు సత్ఫలితాలు సాధించాలన్న ధృడ సంకల్పంతో యుటిఎఫ్ వారు ఉచితంగా పంపిణీ చేయు ఔదార్యాన్ని ఆయన అభినందించారు. 
ఉపాధ్యాయులు తూతిక సురేష్ మాట్లాడుతూ 
రాజాం యుటిఎఫ్ శాఖ వారు తమ పాఠశాలకు ఈ పుస్తకాన్ని బహూకరించుట పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఇప్పటికే పదోతరగతి విద్యార్థులకు చక్కని తర్ఫీదునిస్తున్నామని, తమ ఉపాధ్యాయులందరి వ్యూహరచనలనూ పాటిస్తూ మంచి ఫలితాలు సాధించే దిశగా కృషి జరుగుతోందని అన్నారు. నేడు యుటిఎఫ్ బహూకరించిన ఈ పుస్తకంలో గల కీలకమైన అంశాలను విద్యార్థులు అనుసరించేలా చూస్తామని సురేష్ అన్నారు. ఉపాధ్యాయులు బోనెల కిరణ్ కుమార్, బత్తుల వినీల, కుదమ తిరుమలరావు, యుటిఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు మువ్వల రమేష్, బలివాడ నాగేశ్వరరావులు విద్యార్థులనుద్దేశించి సూచనలు గైకొన్నారు. ఈ కార్యక్రమంలో 
ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, వై.నరేంద్రకుమార్, రవికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణ పాల్గొని ప్రసంగించారు.
కామెంట్‌లు