మహాభారతంలో వ్యక్తులు!- అచ్యుతుని రాజ్యశ్రీ

 టీచర్ అడిగింది " మీకు పాండవులు తెలుసా?" " ఓ ..పంచపాండవులు ధర్మానికి ప్రతీకలు.టీచర్! నేను ధర్మరాజు హిడింబి గూర్చి చెప్తాను. యమధర్మరాజు అంశతో ధర్మానికి పట్టుగొమ్మగా కుంతీదేవి కి ప్రథమసంతానంగా పుట్టాడు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు.భీముడి ఆవేశంని చిటికెలో చల్లబరుస్తాడు. ఆయన ఒక్కడే సశరీరంతో స్వర్గాన్ని చేరాడు.ఎంత ఆపదరాని ధర్మంని వదలడు. జ్యేష్ట నక్షత్రము లో పుట్టి యుధిష్ఠిరుడు అని నామకరణం చేయబడిన వాడు.లక్క ఇంట్లో ఉన్నప్పుడు ఆవిషయం ఒక్క భీమునికి మాత్రం చెప్పాడు" ఈలక్క ఇల్లు నెయ్యి లక్క మొదలైన త్వరగా అంటుకునే పదార్థాలతో చేయబడింది.మనంఅదును చూసి తప్పించుకుని పోవాలి.నీవు రాత్రంతా కాపలా కాయి.పగలు వేటకి వెళ్ళడం రాత్రి జాగ్రత్తగా అమ్మ తో సహా గడపాలి.మనల్ని ఇందులో కాల్చి చంపాలని దుర్యోధనుడి ఎత్తుగడ.నీవే సొరంగం మార్గం గుండా మమ్మల్ని బైటికి తీసుకుని వెళ్లాలి.ప్రతిదీ గుండె లో దాచుకో." అని భీమునికి దిశానిర్దేశం చేశాడు.అలాగే హిడింబి ని పెళ్లి చేసుకోమని ప్రోత్సహించాడు.హిడింబ రాక్షసజాతిలో పుట్టినా మంచి ధర్మాత్మురాలు. అన్నని చంపిన భీముని పెళ్ళాడి ఒక ఏడాది తర్వాత ఘటోత్కచుని కన్నది.పైగా పాండవులకు రాబోయే విషయాలు ముందే చెప్పగల శక్తి సామర్థ్యాలు కల్గింది.పాండవులతో ఇలా అంది" నేను భీముడు ఓఏడాది ఒంటరి దాంపత్య జీవితం గడుపుతాం. మీరు శాలిహోత్రుని ఆశ్రమం లో ఉండండి.ఆతపస్వి తన తపోబలం చేత ఒక చెట్టు ని సృష్టించాడు.ఆచెట్టు కింద మీరు కాలం గడపండి.వర్షం చుక్కలు పడవు. ఇంట్లో ఉన్నంత సుఖంగా ఉంటుంది.అక్కడే ముని సృష్టించిన సరోవరం ఉంది.ఆకలి దప్పులు ఉండవు.వ్యాసమహర్షి వచ్చి చెప్తే కానీ ఆప్రాంతంని వదలకండి" అని సలహా ఇచ్చింది.నిజంగా హిడింబి ఎంతమంచిదో!?" శివా మాటలకు క్లాసంతా చప్పట్ల వర్షం మోగింది.తన అమ్మమ్మ తాతదగ్గర పురాణం వింటున్న శివా ఆదర్శం విద్యార్థి కదూ🌹
కామెంట్‌లు