కోడిపుంజుల పందెం (బాల గేయం) - ఎడ్ల లక్ష్మి
కొమురయ్య తాత వచ్చాడు
కోడిపుంజులు తెచ్చాడు
వాటికి కత్తులు కట్టాడు
పందెంలోకి వదిలాడు!!

పిల్లలు పెద్దలు వచ్చారు
ప్రీతితో పందెం చూసారు
పందెంలో ఆ పుంజులు
ముందు ముందుకురికాయి!!

కత్తులు దూస్తూ లేచాయి
ఎగురుతూ అవి దూకాయి
వాటికి గాట్లు పడ్డాయి
రక్తము ఎంతో కారింది!!

పిల్లలు భయముతో చూసారు
పందెం వారు వద్దన్నారు
పెద్దలు బెట్టు కట్టుతూ
ఆనందంగా చూస్తున్నారు!!

అందులో పుంజు ఒక్కటి
నేల మీద ఒరిగింది
ప్రాణాలేమో వదిలింది
పిల్లలు ఏడుస్తూ వెళ్లారు!!

బెట్టు కట్టిన పెద్దలు 
వెయ్యిల రొక్కం చెల్లించి
గెలిచిన పుంజును కొన్నారు
కోసుకుని వారు తిన్నారు !!


కామెంట్‌లు