తిరుప్పావై ; కొప్పరపు తాయారు
  🌻22వ,పాశురము🌻
అంగణీ. మాజ్డాలత్తరశర్. అభిమాన బుజ్జీ మాయ్
నన్దు నిన్ పళ్ళిక్కట్టిల్  కీళే శబ్ధమిరుపాల్  పోల్ 
వన్దుతలై ప్పెయ్ దోమ్  కఇంగణి  వాయ్  చ్ఛెయద 
తామర  పూపోల్  సంజ్జ శిరిచిరి  యమ్మేల్  
విళియావో  తింగళు మాదిత్తి యను
మెళున్దార్వాల్ అజ్జణ్ణిరణ్ణుం కొండు  ఎఱ్ఱళ మేల్  చా
చాలా మిళన్దేలో. రెమ్బావాయ్
ఈ సుందర విశాలమైన భూమికి ఏకఛత్రాధి  పత్యముగ నేలిన రాజులందరును తమకు ఎదురెవ్వరూ లేరను అహంకారమును వీడి అభిమానులై నీ శరణు జొచ్చిరి  అనన్య శరణాగతి నీ చేయుచు ఈ సింహాసనం కింద గుంపులు గుంపులు చేరినట్లు మేమును అనన్య ప్రయోజనులమై వారి వలె నీ శరణు జొచ్ఛినాము మాకు నీవు దక్క వేరు దిక్కు లేదు స్వామి! చిరుమువ్వలు నోళ్ళు తరచినట్లు గను సగం విరిసిన తామర పువ్వులు వలెను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింప నిమ్ము.
  సూర్యచంద్రులు ఉదయించే ననునట్లు కనిపించు నీ కనుదోయి నుండి జాలువారే కరుణ వాత్సల్య రసదృక్కులు మాపై ప్రసరించినచో  మా కర్మబంధములన్నీ తొలగగనే మేము నిన్ను చేరుకుందుము కదా! మా ఈ వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదే కదా! అని  ఆండాళ్ తల్లి కర్మ బంధం తొలగితే ముక్తి లభిస్తుందని  తెలియజేస్తో
🪷*****🪷****🪷

కామెంట్‌లు