తోబుట్టువులు.. భక్తులు** అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆముగ్గురు అన్నదమ్ములు చెల్లి మహారాష్ట్ర లో పుట్టిన ప్రసిద్ధ పాండురంగని భక్తులైనవారు.వారిలో జ్ఞాన దేవ్ ముక్తాబాయి తమ అభంగాలతో  భక్తి గీతాలతో ప్రచారం చేసిన ఘనులు.వీరంతా ఒకేతల్లి కడుపున పుట్టిన బిడ్డలు.సమాజంనుండి వెలివేయబడిన విఠల్ పంత్ రుక్మాబాయి కన్న సంతానం.విఠల్ చేసిన నేరం ఏమంటే బాల్యంలోనే పెద్దల బలవంతంపై పెళ్లి ఐంది.అదికూడా పాండురంగని అనుగ్రహం కల్లో కన్పించి చెప్పటం వల్లనే.సంతానం కలగక ముందే సన్యాసి గా మారి తిరిగి గుర్వానతితో గృహస్థుగా మారి నల్గురు పిల్లల్ని కన్నాడు.ఆసంతానం కూడా భక్తి వైరాగ్యం తో జీవించారు.అమ్మనాన్న చనిపోయాక వారి పాట్లు ఆపరమాత్మకే ఎరుక.పెద్దవాడిపేరు నివృత్తి దేవ్.రెండోవాడు జ్ఞానదేవ్ మూడో వాడు సోపాన్.కూతురు ముక్తాబాయి.త్రయంబకేశ్వరంలో జరిగే రథోత్సవం కి వెళ్ళారు విఠల్ దంపతులు పిల్లలతో.తిరిగి వస్తుంటే పులిగాండ్రింపుతో జనం చెల్లాచెదురై నారు.ఆరోజుల్లో జనం కాలినడకన గుంపులుగా వెళ్లేవారు.నివృత్ భయంతో ఓగుహలోకి వెళ్లాడు.గహినీనాధ్ అనే మహనీయుడు ఉన్నాడు ఆగుహలో.ఆయన నివృత్ ని అనుగ్రహించి దీక్ష ఇచ్చాడు.ఆబాలుడు అలా కృష్ణ లీలలు గానం చేస్తూ గురువు అనుగ్రహం తో ఇల్లు చేరాడు.తమ్ముళ్లు చెల్లి అనాధలుగా మారారు.భక్తి వైరాగ్యం తో ఉన్న అతను అన్నగా పెద్ద కొడుకు గా తన బాధ్యత బరువులు మరువలేదు.వారికిగూడా దీక్ష ఇచ్చాడు.యాత్రలు చేస్తూ భక్తి ప్రచారంలో మునిగిన నివృత్ నాధ్ ఆదర్శ అన్నగా తోబుట్టువులకి దారి దివ్వెగా నిల్చాడు🌷
కామెంట్‌లు