శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
131)వేదవిత్ -

వేదవిచారణ చేయగలవాడు
విచక్షణ రూపముగలవాడు
వేదకారణమైనట్టివాడు
వేదవిస్తరణము చేయువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
132)కవిః -

స్వరమును వినిపించగలవాడు
చక్షువులకు గోచరించువాడు
అంతయు గమనించుచున్నవాడు
భావనలో మునిగియున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
133)లోకాధ్యక్షః -

విశ్వముకు నాయకుడైనవాడు
సర్వలోకముల నడిపించేవాడు
దేవ, మానవసమూహ నాయకుడు 
చర్యలకు కారకుడైనట్టివాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
134)సురాధ్యక్షః -

సురులకు అధ్యక్షుడైనవాడు
దేవగణములకు నాయకుడు
దివ్యమైన నాయకత్వమున్నవాడు
కార్యములనాదేశించువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
135)ధర్మాధ్యక్షః -

ధర్మాధర్మ వీక్షకుడైనవాడు
ధర్మముకు అధ్యక్షుడైనవాడు
ధర్మపాలన చేయునట్టివాడు
ధర్మముకు నాయకుడైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు