గురుస్థానం మహోత్కృష్ఠమైనది-- జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అభిభాషణ
 గురుకుల విద్యా వ్యవస్థ నుండి నేటి "కృత్రిమ మేథ" విధానం వరకూ విద్యాబోధనలో గురుస్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, గురుస్థానం మహోత్కృష్ఠమైనదని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ సదస్సు అభిప్రాయపడింది. 
పాతపట్నం గ్రామానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధినేత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు పారిశెల్లి రామరాజు నేతృత్వంలో ఆదివారం స్థానిక విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల విద్యాసదస్సు నిర్వహించారు. సీనియర్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత చౌధరి రాధాకృష్ణ అధ్యక్షతన గురుకులం నుండి కృత్రిమ మేథ వరకు విద్యాబోధనలో గురువు పాత్ర అనే అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. 
ఈ సదస్సులో ప్రసంగించిన వక్తలు సమాజాభివృద్ధి, సామాజిక మార్పు, విద్యార్థి సర్వతోముఖాభివృద్ధిలో గురువు గురుతరమైన బాధ్యత నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
మారుతున్న వ్యవస్థలకు అనుగుణంగా గురువులు కూడా ఉన్నత స్థితికి చేరారని వీరు పేర్కొన్నారు. కార్యక్రమంలో చౌధరి రాధాకృష్ణ, పారిశెల్లి రామరాజు, దూసి ఆంధ్రా స్టాలిన్, బినోద్ చంద్ర జెన (ఒడిషా), కుదమ తిరుమలరావు, ప్రగడ గణపతిరావు, ఉప్పాడ సూర్యనారాయణ, పి.కూర్మాచార్యులు, జి.రామమోహనరావు, జె.సి.దేవదాస్, మణిపాతృని నాగేశ్వరరావు, ఎం.ధూళికేశ్వరరావు, పెంకి గౌరీశ్వరరావులు పాల్గొన్నారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
చర్చాగోష్ఠి అనంతరం రామరాజు చారిటబుల్ ట్రస్ట్ (పాతపట్నం), 
ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన పదమూడు మంది 
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకు
ఘన సన్మానం చేసారు. ట్రస్ట్ అధ్యక్షులు పారిశెల్లి రామరాజు నేతృత్వంలో, చౌధరి రాధాకృష్ణ అధ్యక్షతన ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో చౌధరి రాధాకృష్ణ, పారిశెల్లి రామరాజు, దూసి ఆంధ్రా స్టాలిన్, బినోద్ చంద్ర జెన (ఒడిషా,) కుదమ తిరుమలరావు, ప్రగడ గణపతిరావు, ఉప్పాడ సూర్యనారాయణ, పి.కూర్మాచార్యలు, జి.రామమోహనరావు, జె.సి.దేవదాసు, మణిపాతృని నాగేశ్వరరావు, ఎం.ధూళికేశ్వరరావు, పెంకి గౌరీశ్వరరావులకు శాలువా జ్ఞాపికలతో ఘనసన్మానం చేసారు.

కామెంట్‌లు