మార్పు!!!?; - ప్రతాప్ కౌటిళ్యా
అక్కడ  సముద్రం నిర్మించబడుతుంది.!
నదులు సమాధి చేయబడుతున్నవీ!!

అక్కడ అడవి పుడుతుంది.!
మైదానం మాయమవుతుంది.!!

అక్కడ పర్వతాలు చెక్కబడుతున్నవీ
భూమి శిథిలాల శిల్పాలు మాయమవుతున్పవీ!!!!!!!!

అక్కడ తడారి ఎడారి పుడుతుంది.!!
నీరు కన్నీరు కారుస్తుంది!!!!?

నిర్మించబడ్డ ప్రతిదీ కొంత బలిగొంటుంది!!
కొంత కోల్పోతుంది.!!!
నిర్మించబడటం నిజంగా ఊహించడం కాదు
ఉన్నదాన్ని మార్చడం!!!?

నేటి నిర్మాణం
ఒకప్పటి గొప్ప మార్పు!!

నీటి మార్పు
రేపటి గొప్ప నిర్మాణం!!

ఏది శూన్యంలోంచి రాదు
ఉన్నదాంట్లోంచే పుడుతుంది!!!?

ప్రకృతికి నచ్చిన నచ్చకపోయినా
మార్పు అనివార్యం!!!
అందుకే

నదులు మాయమవుతున్నట్లు
సముద్రము మాయం అవ్వచ్చు!!?

మైదానం మాయమవుతున్నట్లు
అడవులు మాయమవ్వవచ్చు!!?

భూమి శిథిలాలు మాయమవుతున్నట్లు
పర్వతాలు మాయం అవ్వచ్చు!!?

నీరు మాయమవుతున్నట్లు
ఎడారి మాయమవ్వవచ్చు!!!!!

ప్రతాప్ కౌటిళ్యా 🙏

కామెంట్‌లు