ఓ కోకిలా!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఓ కోకిలా
ఎప్పుడొస్తావే
ఎంతసేపుంటావే
ఏమేమిచేస్తావే

ఓ కోకిలా
ఏపాటపాడుతావే
ఏఆటనాడుతావే
ఏమాటనేర్పుతావే

రావే
మాపెరడుకు
చేయకే
ఆలశ్యమును

ఎక్కవే
మామిడిచెట్టును
కూర్చోవే
కొమ్మమీదను

కూయవే
కుహూకుహూమంటు
చిందవే
చుట్టూతేనెచుక్కలను

తెరవవే
నోరును
కదపవే
తోకను

ఎత్తవే
గళమును
పంచవే
మాధుర్యమును

పాడవే
కమ్మనిపాటను
అందించవే
శ్రావ్యతను

చూపవే
అందాలను
కూర్చవే
ఆనందాలను

ఉండవే
జాగ్రత్తగాను
పొడుస్తాయే
కాకులమూకలు

తంతాయే
కాళ్ళతోకాకమ్మలు
గోలచేస్తాయే
కావుకావుమంటు

ఏపాటను
పాడతావే
ఎంతసేపు
ఉంటావే

ఏగానము
ఎత్తుతావే
ఏరాగము
తీస్తావే

ఏ ఆటను
ఆడతావే
ఏ బాటను
పడతావే

వింటానే
నీకంఠమును
కొడతానే
చప్పట్లును

రావేరావే
రోజురోజు
రాయించవే
రమ్యకవితలు


కామెంట్‌లు