శ్రీ విష్ణు సహస్రనామాలు - (బాల పంచపది -ఎం. వి. ఉమాదేవి
106)సత్యః -

సత్యమైన స్వరూపమువాడు
సత్యంలో నిండినట్టి వాడు
సత్యమైన భావనగల్గువాడు
సత్యాత్మికుడు తానైనవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
107)సమాత్మాః -

సమస్తప్రాణుల సమాదరితుడు
సమముగా వర్తించెడివాడు
సమదర్శిగా యుండెడివాడు
సమముగా వ్యాపించినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
108)సమ్మితః -

భక్తులకు చేరువ అయినవాడు
భక్తికి అధీనుడైయుండువాడు
శరణాగతి చూపించువాడు
భక్తులలోనే లీనమైనవాడు
 శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
109)సమః -

సమస్థితిలో నుండగలవాడు
సమాధానం నీయదగినవాడు
సమస్యల తొలగించగలవాడు
సదాలక్ష్మితో విరాజిల్లువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
110)అమోఘః -

వ్యర్థముకానటువంటివాడు 
భక్తులనాదరించుచున్నవాడు
స్తుతులనాలకించునట్టివాడు
ఫలితము తానివ్వగలవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు