కడుము పాఠశాలకు లక్ష రూపాయల విరాళం.

 కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు, ఆ పాఠశాలలో చదువుకొని నేడు రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడిన పూర్వ విద్యార్ధి లక్షరూపాయల విరాళాన్ని ప్రకటించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అధ్యక్షతన, 1996 నుండి 2001 మధ్యకాలంలో ఈ పాఠశాలలో చదువు నేర్చుకున్న పూర్వ విద్యార్ధులంతా సమావేశమై, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడిన పూర్వ విద్యార్ధి, భామిని మండలం కోసలి గ్రామానికి చెందిన నెయిగాపుల వైకుంఠరావు, లక్షరూపాయలను ప్రకటించారు.  
ప్రధానోపాధ్యాయులు 
తిరుమలరావు మాట్లాడుతూ చదువునేర్పిన ఈ కడుము హైస్కూల్ పట్ల వైకుంఠరావుకు గల కృతజ్ఞతలతో కూడిన అభిమానం మిక్కిలి అభినందనీయమని  అన్నారు. వైకుంఠరావు సూచన మేరకు ఈ ప్రకటించిన పైకాన్ని పాఠశాలలో సైకిల్ షెడ్ నిర్మాణానికి ఉపయోగిస్తామని అన్నారు. 
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, సర్పంచ్ గుజ్జ రామారావు, ఎంపిటిసి వలురోతు గోవిందరావు, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ బూరాడ రమేష్, వైస్ చైర్మన్ భూపతి లక్ష్మి, మాజీ సర్పంచ్ వలురోతు ధర్మారావు,  ఆనాటి ఉపాధ్యాయులు వైఎస్ ప్రకాశం, బి.చంద్రమోహన్, బి.దుర్గాప్రసాద్, టి.రాజు, రఘురాం మహంతి, సూర్యారావు, మరియు రబికుమార్ మహాపాత్రో, ఎస్.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు